Saturday, April 27, 2024

బ్లాక్ కలర్ బెంజ్ కారులో రామ్ చరణ్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌ కి ల‌గ్జ‌రీ కార్లు అంటే ఎంతో మక్కువ.. తాజాగా చెర్రీ ఓ బెంజ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుని చెర్రీ త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా డిజైన్ చేయించుకున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఈ కారుని చెర్రీకి హ్యాండోవ‌ర్ చేయ‌గా, బ్లాక్ కలర్ బెంజ్ కారులో రామ్ చరణ్ రయ్‌మని వెళ్లిపోయారు. దీని ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కారుకి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. కాగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రు క‌లిసి ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో న‌టించ‌గా, ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే దానిపై క్లారిటీ లేదు.ఇప్ప‌టికే షూటింగ్ పూర్తైన‌ప్ప‌టికీ థియేట‌ర్స్ అన్నీ తెర‌చుకోని కార‌ణంగా మేక‌ర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌లేక‌పోతున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా క‌నిపించ‌నున్నారు.

https://twitter.com/baraju_SuperHit/status/1437063177716396036

ఇది కూడా చదవండి: సీటీమార్ సక్సెస్‌పై ప్రభాస్ హ్యాపీ

Advertisement

తాజా వార్తలు

Advertisement