Saturday, May 4, 2024

Esha Rebba : న‌లుపులోనూ అందం….

సినిమా ఇండస్ట్రీలో పలు డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తెలుగు పాప ఈషా రెబ్బ. అమ్మడు మొదట్లో కొన్ని చిన్న సినిమాలతోనే మంచి సక్సెస్ లను సొంతం చేసుకుంది. 2012 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ వరంగల్ అమ్మాయి ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పెద్ద సినిమాలలో కూడా స్పెషల్ పాత్రలలో కనిపించింది.

- Advertisement -

తన పాత్ర చిన్నదా పెద్దదా అని చూడకుండా మంచి కంటెంట్ ఉంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈషా పాపా గ్లామర్ తో కూడా అప్పుడప్పుడు ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అప్పుడప్పుడు ఊహించిన విధంగా గ్లామరస్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫోటోషూట్స్ లో పాల్గొంటూ ఉంటుంది.


రీసెంట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ లో తనదైన శైలిలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె చూపులతోనే ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఇంతకంటే ఘటైన స్టిల్స్ లలో కూడా కనిపించిన ఈషా పాప ఇప్పుడు మాత్రం మరింత అందంగా కనిపిస్తోంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ప్ర‌స్తుతం పలు వెబ్ సిరీస్ లు న‌టిస్తున్న‌ది. రెండు సినిమాలలో హీరోయిన్ గా ఎంపికైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement