Thursday, April 18, 2024

సీటీమార్ సక్సెస్‌పై ప్రభాస్ హ్యాపీ

టాలీవుడ్‌లో ప్రభాస్- గోపీచంద్ లు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికి తెలిసిందే. వర్షంతో మొదలైన వీరి ఫ్రెండ్ షిప్ నేటీకి కొనసాగుతోంది. ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కు పెరిగిన త‌న ఫ్రెండ్ గోపీచంద్‌కు ఎప్ప‌టికీ అండగా నిల‌బ‌డుతూ వ‌స్తున్నాడు. గోపీచంద్ సినిమాలకు సంబంధించిన వీలైనంత స‌పోర్ట్‌ను అందిస్తున్నాడు. తాజాగా గోపీచంద్ సీటీమార్ మూవీ హిట్ కావడంతో ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశాడు.

గోపీచంద్‌, త‌మ‌న్నా జంటగా నటించిన సీటీమార్ మూవీ వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 10న విడుదలైంది. క‌బ‌డ్డీ స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌తో రూపొందిన ఈ మూవీని సంపత్ నంది తనదైన స్ట్రైల్ తెరకెక్కించాడు. సీటీమార్‌ సినిమా విడుద‌లై మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తొలిరోజునే దాదాపు నాలుగు కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. కరోనా సెకండ్ కోవిడ్ స‌మ‌యంలో దేశం యావ‌త్తు విడుద‌లైన సినిమాల్లో టాప్‌ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా సీటీమార్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. దీంతో ఫ్రెండ్ సినిమా మంచి హిట్ అందుకోవడంతో ప్రభాస్ స్పందించాడు.

త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గోపీచంద్‌ను, సీటీమార్ స‌క్సెస్ పై విజిల్ బొమ్మ‌ను పోస్ట్ చేశాడు. ‘’నా స్నేహితుడు  సీటీమార్‌ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న కోవిడ్ సెకండ్ వేవ్‌ ప‌రిస్థితుల్లో తొలి భారీ చిత్రాన్ని రూపొందించి విడుద‌ల చేసిన టీమ్‌కు హ్యాట్సాఫ్‌’’ అంటూ ప్రభాస్ పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement