Sunday, April 28, 2024

బంగార్రాజు సినిమాపై లేటెస్ట్ గాసిప్

అక్కినేని నాగార్జున కెరీర్ లో సోగ్గాడే చిన్నినాయన చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా చేయబోతున్నారు నాగార్జున. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య ఓ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. చైతు కొడుకు పాత్రలో అక్కినేని అఖిల్ కనిపిస్తారట. అంటే బంగార్రాజు మనవడుగా అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట.

తాతా మనవళ్ళ మధ్య ఈ సినిమా మొత్తం నడవనుందట. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మొదట ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాడు. కానీ ఇప్పుడు అది జరిగేలా కనిపించట్లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement