Thursday, May 9, 2024

AP : చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖని నిద్రలేపడమే… సీఎం జ‌గ‌న్‌

చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖని నిద్రలేపడమేనంటూ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తాడిపత్రిలో బహిరంగ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోతారని అన్నారు.

- Advertisement -

నన్ను ఒక్కడిని చేసి అందరూ మూటగట్టుకొని వస్తున్నారని ఆవేదన చెందారు. వాళ్లందరికీ ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు.
తన నమ్మకం దేవుడు, ప్రజలపైనే పెట్టానని చెప్పారు. నాలుగున్నరేళ్లు లంచాలు, వివక్షతలేని పాలన అందించామని వెల్లడించారు. 58 నెలల పాలనలో ఎక్కడా వివక్ష లేదు, లంచాలు లేవు అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో మాట్లాడే పిల్లలు కూడా అనర్గలంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని అన్నారు. గ్రామాల్లోనే అన్ని సేవలు అందేలా చేశామని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలు అన్నీ ఆగిపోతాయని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అన్నారు.

చంద్రబాబు మ్యానిఫేస్టో విడుదలకు సిద్ధమవుతున్నారని, ఆయన మాయమాటలకు పడిపోవద్దని అన్నారు. తనకు ఏ జెండాతో పొత్తులు లేవని, జనాలకు మంచి చేసిన నమ్మకమని అన్నారు. మ్యానిఫేస్టోలో 99 శాతం అమలు చేశామని అన్నారు. మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దీవెనలను కోరుతున్నాడని జగన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా బటన్ నొక్కి 2.75 లక్షల కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు.

చంద్రబాబు అలివి కానీ హామీలతో మీ ముందుకు ఖచ్చితంగా వస్తాడని, వాటిని నమ్మితే నట్టేట మునిగినట్లేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2.31 లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత మీ ప్రభుత్వ హయాంలోనేనని అన్నారు. ఇంటివద్దకే పథకాలను డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా మీ బిడ్డ హయాంలోనే జరిగిందన్నారు. పేద పిల్లలు చదువుకునే బడులు బాగుపడ్డాయని అన్నారు. ఆసుపత్రులు మెరుగుపడ్డాయని తెలిపారు. గ్రామాలకు వచ్చి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. రైతులకు అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాలను గ్రామాలలోనే ఏర్పాటు చేసి వారికి అండగా నిలిచామని తెలిపారు. గ్రామాలన్నీ ఈరోజు ఎంత అభివృద్ధి చెందాయో? ఎన్ని మార్పులు వచ్చాయో? మీకు తెలుసునని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement