Friday, May 3, 2024

TS : నిజామాబాద్‌లో దారుణం.. వైద్యం వికటించి గర్భిణీ మృతి

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 28 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి గర్భిణీ మృతి చెందింది. న్యాయం చేయాలంటూ మృత‌దేహంతో ఆసుపత్రి ముందు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

- Advertisement -

నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని కాలూరి గ్రామానికి చెందిన కంఠం స్రవంతి (35) నాలుగు నెలల గర్భిణి… వైద్య పరీక్షలు నిమిత్తం శనివారం ఉదయం నిజాంబాద్ నగరం లోని ఖలీల్వాడిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డాక్టర్‌ని సంప్రదించింది. సదరు వైద్యులు గర్భంలో ఉన్న పాప పరిస్థితి బాగాలేదని హార్ట్ బీట్, శ్వాసకు సంబంధించిన సమస్యతో ఉందని వైద్యుడు గర్భిణి కి తెలిపారు. వెంటనే అబార్షన్ చేయాలని లేకుంటే ప్రమాదం ఉందని వైద్యుడు తెలిపారు. అబార్షన్ కు సంబంధించిన మందులు గర్భిణీకి ఇచ్చారని బంధువులు ఆరోపించారు. దీంతో మందులు తీసుకొని ఇంటికి వెళ్ళామని బంధువులు తెలిపారు. తీరా అబార్షన్ కు సంబంధించిన మందులు వేసుకున్న అనంతరం గర్భిణీకి తీవ్ర రక్తస్రావం రావడంతో సదరు భర్త బంధువులు తీవ్ర ఆందోళనకు గురై ఫోన్లో వైద్యుని సంప్రదించారు.

ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఉదయాన్నే గర్భిణీ నీ ఆస్పత్రికి తీసుకురావాలని వైద్యుడు సూచించినట్లు బంధువులు తెలిపారు. ఆదివారం ఉదయం గర్భిణీని తీసుకొని ఆసుపత్రికి తీసుకురాగా… గర్భిణీ పరిస్థితి విషమించిందని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సదరు ప్రైవేట్ వైద్యులు సూచించినట్లు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక గర్భిణీ బంధువులు గర్భిణిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందని మరో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలపడంతో బంధువులు తీవ్ర ఆందోళన గురయ్యారు. గర్భిణీ శవంతో ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. గర్భిణీ కి వైద్యం అందించడంలో సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే మృతి చెందిందని న్యాయం చేయాలని బంధువుల రోదనలు మిన్నంటాయి.. న్యాయం జరిగేంతవరకు ఇకనుంచి వెళ్ళేది లేఅయ్యాలిటీ ఆసుపత్రి ఎదుట భీష్మించుకుని కూర్చున్నారు. సదరు బాధితులకు ప్రవేట్ ఆసుపత్రి యాజమాన్యం కొంతమేరకు నష్టపరిహారం చెల్లించడంతో సమస్య కాస్త సద్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement