Friday, May 3, 2024

AP : జ‌గ‌న్ సిఎం అయిన ఆరు రోజులుకే ప‌ద‌వా.. విశాఖ‌లో ధ్వ‌జ‌మెత్తిన ష‌ర్మిల‌

సీఎం జగన్-ఏఏజీ పొన్నవోలు మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ పదవీ ప్రమాణ స్వీకారం అయిన ఆరురోజులకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రోకో కాదా అంటూ ధ్వజమెత్తారు. విశాఖ‌లో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ఆమెపై చేసిన కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

మహిళ అని సంస్కారం లేకుండా, ఏపీ కాంగ్రెస్ చీఫ్‌తో మాట్లాడుతున్నాననేది లేకుండా త‌న‌ను ఏకవచనంతో పొన్నవోలు సంభోదిస్తూ ఊగిపోయారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న టాలెంట్‌లో కేవలం స్వామి భక్తి, జగన్ భక్తి మాత్రమే కనిపించిందన్నారు. నిజానికి జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఛార్జిషీటులో వైఎస్ఆర్ పేరును చేర్చలేదన్నారు. అడ్వకేట్ పొన్నవోలు వైఎస్సార్ పేరు సీబీఐ ఛార్జిషీటులో లేకపోతే జగన్ బయటకు రావడం కష్టమని భావించారన్నారు.

ఈ క్రమంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు కూడా ఆయన వెళ్లారని గుర్తు చేశారు వైఎస్ షర్మిల. చేసే ప్రక్రియ బట్టి నిర్ణయం తీసుకుందామని అత్యున్నత న్యాయస్థానం చెప్పడంతో ఆయన సైలెంట్ అయిపోయారన్నారు. వైఎస్ఆర్ అంటే అభిమానం అని చెప్పే పొన్నవోలు.. ఆయన పేరును ఛార్జిషీటులో ఎలా చేర్చారు? అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

జగన్ ఆదేశాల మేరకే సీబీఐ ఛార్జిషీటులో వైఎస్సార్ పేరును పొన్నవోలు పెట్టారన్నారు వైఎస్ షర్మిల. అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని పొన్నవోలుకు సీఎం జగన్ ఇచ్చారని తెలిపారు. జగన్ సీఎంగా మే 30న పదవీ స్వీకారం చేయగా, కేవలం ఆరు రోజుల్లోనే ఆయనకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారన్నారు. ఇదీ ముమ్మాటికీ క్విడ్ ప్రోకో కాదా మీరే ఆలోచించాలన్నారు. పులివెందుల వేదికగా సీఎం జగన్ మాట్లాడిన దానికి తాను కౌంటర్ ఇస్తున్నానని తెలిపారు. వైఎస్సార్ పేరును కాంగ్రెస్ పార్టీ ఛార్జిషీటులో చేర్చిందని జగన్ చేసిన కామెంట్స్‌కి దానికి బదులు ఇచ్చానని గుర్తుచేశారు షర్మిల.

Advertisement

తాజా వార్తలు

Advertisement