Monday, May 20, 2024

Telangana – మ‌ల్కాజిగిరిలో స్థానికుడికే ఓటేయండి – కెటిఆర్

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలంటేకే కేసీఆర్ సైనికులు పార్ల‌మెంట్‌లో ఉండాలి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఓల్డ్ అల్వాల్‌లో ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్‌లో ఆయ‌న మాట్లాడుతూ, మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్, సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి ఇద్ద‌రూ పొలిటిక‌ల్ టూరిస్టులు అని, మే 13 త‌ర్వాత మ‌ళ్లీ వారు క‌న‌బ‌డ‌రు అని పేర్కొన్నారు.

మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి సునీతా మ‌హేంద‌ర్ రెడ్డిది తాండూరు అని. వాస్త‌వానికి చేవెళ్ల సీటు అడిగితే బ‌ల‌వంతంగా రేవంత్ రెడ్డి మ‌ల్కాజ్‌గిరి సీటు క‌ట్ట‌బెట్టార‌న్నారు. . ఆమె కూడా బ‌ల‌వంతంగానే ప్ర‌చారం చేస్తోంద‌ని, ఆమె ఓడిపోతే మ‌ళ్లీ తాండూరు వెళ్లాల్సిందేన‌న‌న్నారు. . ఇక ఈట‌ల రాజేంద‌ర్‌ది కూడా మ‌ల్కాజ్‌గిరి కాద‌ని, . ఆయ‌న హుజురాబాద్ వెళ్లిపోవాల్సిందేనే వెల్ల‌డించారు.. బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి మాత్రం లోకల్. ఉప్ప‌ల్‌లోనే ఉంటార‌ని, మ‌న మ‌ధ్య‌లోనే ఉండే వ్య‌క్తి అంటూ ఆయ‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కేటీఆర్ కోరారు.

- Advertisement -

ఐదు నెల‌ల కింద మ‌స్తు మాట‌లు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆడ‌బిడ్డ‌ల‌కు స్కూటీలు, తులం బంగారం ఇస్తా అన్నాడు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మ‌హిళ‌ల‌కు రూ. 2500 ఇస్తా అన్నాడు. కానీ ఏ ఒక్క‌టీ కూడా అమ‌లు కాలేదు. ఐదు నెల‌ల నుంచి చిల్ల‌ర మాట‌లు ఉద్దెర మాట‌లు మాట్లాడుతున్నాడు. తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా త‌యారైంది. సినిమాలో విల‌న్ డైలాగులు త‌ప్ప ఒక్క మంచి ప‌ని చేయ‌లేదు. కొత్త ఇండ‌స్ట్రీలు వ‌చ్చుడేమో కానీ.. ఉన్న ఇండ‌స్ట్రీలు వెళ్లిపోతున్నాయి.
ఫార్మా సిటీని ర‌ద్దు చేశారు. ఇలా తెలివి త‌క్కువోళ్ల‌కు అవ‌కాశం ఇస్తే క‌రెంట్, ఉద్యోగాలు రావు. రియ‌ల్ ఎస్టేట్ ఢ‌మాల్.. ఇచ్చిన గ్యారెంటీ నిలుపుకోలేని ప‌రిస్థితి కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అంటే.. ఇన్వ‌ర్ట‌ర్, జ‌న‌రేట‌ర్, క్యాండిల్ లైట్, టార్చ్ లైట్, ప‌వ‌ర్ బ్యాంక్, ఛార్జింగ్ బ‌ల్బ్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉన్నంత‌కాలం క‌రెంట్ ఉండ‌దు. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రాగానే.. బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేయాల‌ని అడుగుతున్నారు. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన‌ప్పుడు తెలంగాణ సాధించుకోవాలంటే పార్ల‌మెంట్‌లో మ‌నం శాసించే ప‌రిస్థితి ఉండాల‌న్నారు.

కాంగ్రెస్ , బీజేపీ ఎంపీలు.. రాహుల్ గాంధీ, మోదీ చెప్పింది చేస్తారు. తెలంగాణ‌ గురించి ద‌మ్మున్న నాయ‌కులే కొట్లాడుతారు. జూన్ 2వ తేదీ త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ఆలోచ‌న చేస్తున్న‌ది. కేంద్ర పాలిత ప్రాంతం అయితే.. హైద‌రాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. ఒక్క చిన్న ప‌ని కూడా చేసుకునేందుకు అవ‌కాశం ఉండ‌దు. మోరీ, నాలా నిర్మించాల‌న్నా, రోడ్డు వేయాల‌న్నా ఢిల్లీకి పోయి అడ‌గాలి. కేంద్ర పాలిత ప్రాంతం ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకోవాలంటే గులాంబీ జెండా పార్ల‌మెంట్‌లో ఎగ‌రాలి. రాగిడి ల‌క్ష్మారెడ్డి గెల‌వాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్కాజ్గిరి ఎన్నికల ఇంచార్జ్ నందికంటి శ్రీధర్ , బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు,హాజరయ్యారు. .. కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మల్కాజిగిరి యూత్,ముఖ్య నాయకులు,కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement