Wednesday, June 19, 2024

అన్నమయ్య కీర్తనలు : ఏడ వలపేడ

రాగం : రేవతి

ఏడవలపేడ మచ్చి కేడ సుద్దులు
ఆడుకొన్నమాటలల్లె నవి నిజాలా||

తొలుకారు మఱుపులు తోచి పోవుగాక
నెలకొని మింట నవి నిలిచీనా
పొలతులవలపులు పొలసిపోవుగాక
కలకాలంబవి కడతేరీనా||

యెండమావులు చూడ నేరులై పారుగాక
అండకుపోవ దాహమణగీనా
నిండినట్టి మోహము నెలతలమది చూడ
వుండినట్టే వుండుగాక వూతయ్యీనా||

కలలోని సిరులెల్ల కనుకూర్కులేకాక
మెలకువ చూడ నవి మెరసీనా
అలివేణుల మేలు ఆసపాటేకాక
తలపు వేంకటప తి తగిలీనా||

Advertisement

తాజా వార్తలు

Advertisement