Friday, May 10, 2024

AP : త‌నిఖీల్లో…14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం పట్టివేత

కంచికచర్ల, ప్రభ న్యూస్ : సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అక్రమ మద్యం నగదు రవాణా పై డేగ కన్నుపెట్టిన ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు పోలీసులు ఆదివారం భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా నేషనల్ హైవే 65 విజయవాడ హైదరాబాదు రహదారిపై ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

వాహనాల తనిఖీలలో భాగంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం నెంబర్ 5 ఆదివారం ఉదయం 65వ నంబర్ జాతీయ రహదారిపై కంచికచర్ల మండలం పేరకలపాడు అడ్డరోడ్డు వద్ద 14 కోట్లు విలువైన 66 కేజీల బంగారు వెండి ఆభరణాలను పట్టుకున్నారు.
ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ నెంబర్ 5 ఇంచార్జ్ కె. బాలశంకర్ రావు ఉదయం ఏడు గంటల ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. చెన్నై ముంబై పూణే తదితర ప్రాంతాల నుంచి హైదరాబాదులోని బివిసి లాజిస్టిక్ కు చేరుకున్నాయి. అక్కడ నుండి ప్రత్యేక వాహనంలో విజయ వాడ లోని మలబార్, కళ్యాణ్, లలిత తదితర జ్యువెలరీ దుకాణాలకు అందజేసేందుకు వెళుతుండగా పేరకలపాడు అడ్డరోడ్డు వద్ద వాహనాల తనిఖీలలో ఎలక్షన్ ఫ్లైయింగ్ స్పీడ్ కు పట్టుబడ్డాయి.

అయితే పట్టుబడిన ఆభరణాలన్నిటికీ అన్ని రకాల బిల్లులు ఉండటం విశేషం. సమాచారం అందుకున్న గ్రామీణ సిఐ పి. చంద్రశేఖర్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఎస్ బి సి ఐ సురేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘటనాస్థలం వద్దకు వెళ్లి పరిశీలన జరిపారు. పట్టుబడిన 66 కేజీల 740 గ్రాముల గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కలిపి టోటల్ వాల్యూ 14 కోట్ల 11 లక్షల 99 వేల 897 రూపాయలు గా బిల్లులు తెలుపుతున్నాయి. విజయవాడ ఎయిర్పోర్ట్ లో కార్గో సేవలు లేకపోవడంతో, హైదరాబాదు నుండి రోడ్డు ద్వారా వెండి బంగారు ఆభరణాలను బీవీసీ లాజిస్టిక్స్ ద్వారా ద్వారా విజయవాడ తరలిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా జీఎస్టీ నోడల్ అధికారి, డిప్యూటీ కమిషనర్ జిఎస్టి శైలజ, విజయవాడ గారికి సమాచారం అందించారు. వీరితో పాటు నందిగామ ఆర్డీవో, ఇన్కమ్ టాక్స్ అధికారులు, కమర్షియల్ టాక్స్ అధికారులకు కూడా సమాచారం అందించారు.
డి సి టి ఓ కూడా సంఘటన స్థలానికి వస్తున్నారు. బిల్లులు ప్రకారం మొత్తం వెయిట్ ప్రకారం ఉన్నాయా లేవా అని చెక్ చేయవలసి ఉంది. బిల్లులకు పట్టుబడిన ఆభరణాలకు వ్యత్యాసాలు ఉన్నా, బిల్లులు సరి అయినవా కాదా అని నిర్ధారించుకున్న తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇన్కమ్ టాక్స్ జీఎస్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా బీవీసీ లాజిస్టిక్స్ కు ఆభరణాలను ఆంధ్ర లో పలు ప్రాంతాలకు చేరవేసేందుకు అనుమతి లేనట్లు తెలిసింది. కేవలం తెలంగాణ రాష్ట్రంకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలిసింది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement