Monday, May 20, 2024

TS: కష్టం ఒక‌రిది.. ప్రతిఫలం ఇంకొకరిది.. కాంగ్రెస్ తోనే ప్ర‌జా సంక్షేమం..

నిజామాబాద్ ప్రతినిధి, మే 10(ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ఏర్పాటైతే…. కష్టపడింది ఒకరైతే.. ప్రతిఫలం ఇంకొకరిది… అన్నచందంగా ఫలితం మాత్రం కేసీఆర్ అనుభవించిండని కర్ణాటక మంత్రి బోస్ రాజు, మాజీ మంత్రి మండవ వెంకటే శ్వరరావు అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి దేవుడెరుగు.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది అంటే… మాట మీద నిలబడి ఉంటుందని అధికారంలోకి రాగానే ఇచ్చిన ఐదు గ్యారంటీలను కచ్చితంగా నెరవేరుస్తామని బోస్ రాజు అన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.

శుక్రవారం నిజామాబాద్ లోని హోటల్ కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్ణాటక మంత్రి బోస్ రాజు, మాజీ మంత్రి మండవ వెంకటే శ్వరరావు మాట్లాడుతూ….. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రెండు సవాళ్లు ఉన్నాయని ఒకటి అప్పులను చెల్లిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నేర్చాలని ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి ఎంతో బలమైన నమ్మకంతో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారన్నారు. కేసీఆర్ రూ.7500 లక్షల కోట్ల రూపాయలు అప్పు లు చేసి, 45 వేల కోట్ల బిల్లులు అన్ని శాఖల్లో పెండింగులో పెట్టారని ఆయన అన్నారు. కేసీఆర్ దిగిపోతూ రూ.7500 వేల కోట్ల రూపాయలు రైతు బంధు వేశామని చెప్తున్నాడని, మరి రైతుల ఖాతాలో డబ్బులు రాలేద‌న్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేద మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు అందిస్తామని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామని, దానికి చట్ట భద్రత కూడా కల్పిస్తామన్నారు. కుల గణన చేసి ప్రతి వ్యక్తి సామాజిక న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందన్నారు. ఎన్నికల్లో పార్టీలు హామీలు ఇవ్వడం సహజమేనని కానీ మొదటిసారి దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్యారంటీ అనే పదాన్ని ఇచ్చిన హామీలకు గ్యారెంటీ కార్డును ఇచ్చింది కర్ణాటక రాష్ట్రంలో అని, దానికి వచ్చిన స్పందన చాలా బాగుందన్నారు. తెలంగాణ‌లో విజయం సాధించిన కొద్ది రోజుల్లోనే ఐదు గారెంటీలను రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేశారని అదే ధీమాతో ప్రస్తుతం కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ పంచ్ న్యాయ్ పేరుతో ఐదు గ్యారెంటీలను ప్రజలకు ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హాందన్, ప్రేమలత అగర్వాల్, కేశ వేణు, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement