Saturday, June 22, 2024

Chhattisgarh : అట‌వి ప్రాంతాల్లో కాల్పులు… జ‌వాన్ మృతి

ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు తిరుగుతున్నారనే సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల కూంబింగ్ నిర్వహించారు.ఈ క్రమంలోనే బేడా అటవీ ప్రాంతంలో మావోలు.. పోలీసులకు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే వారు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో వెంటనే జవాన్లు కూడా మావోయిస్టుల పై కాల్పులు జరిపారు.

- Advertisement -

దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. అటవీ ప్రాంతం మొత్తం తుపాకి శబ్దాలతో దద్దరిల్లిపోయింది. కాగా ఈ కాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా మరో జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement