Friday, December 6, 2024

NZB: రైల్వే బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి..

నిజామాబాద్ ప్రతినిధి, జులై 26(ప్రభ న్యూస్) : మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని.. ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ చూపి త్వరగా పూర్తయ్యేలా చూడాలని పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ అన్నారు.
శుక్రవారం తెలుగుదేశం నిజామాబాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ మాట్లాడుతూ… వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. జిల్లాలో వర్షాల కారణంగా గుంతలమయమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

వాతావరణంలో మార్పుల దృష్ట్యా అంటువ్యాధులు బాగా పెరుగుతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. బడ్జెట్ లో షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని అనడం సంతోషకరమన్నారు. ఆగస్టు 15లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ అధ్యక్షులు అంబిక సత్యనారాయణ, అర్బన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లెడ గంగాధర్, జనరల్ సెక్రెటరీ శంకర్ ముదిరాజ్, బొబ్బ నరసింహ రావు, లవంగా రాజు, షేక్ ఫెరోజ్, స్వామి, నాగేశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement