Friday, July 26, 2024

TS : మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

దక్షిణ బంగాళాఖాతం ఇవాళ‌ నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగి నేడు బలహీనపడిందని అన్నారు.

- Advertisement -

నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 – 40 కి.మీ. ఈదురు గాలులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవాళ‌ తెలంగాణా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గాలుల వేగం గంటకు 30 నుండి 40 కి.మీ), మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో గాలులు (40-50 కి.మీ/గం) వీచే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. గంటకు 6-8 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలు. గాలి తేమ 81 శాతంగా నమోదైంది.

ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఒకటి లేదా రెండుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement