Tuesday, May 7, 2024

Archery World Cup-2024: భారత్ కు మరో స్వర్ణం

ఆర్చరీ వరల్డ్ కప్‌ 2024లో భారత్‌ మళ్లీ అద్భుతం చేసింది. ఇప్పటికే కాంపౌండ్‌ విభాగంలో మూడు, వ్యక్తిగత విభాగంలో ఒక స్వర్ణాన్ని గెలిచిన టీమ్‌ఇండియా మరో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రికర్వ్‌ విభాగంలో భారత్ 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన భారత జట్టు ఒలింపిక్‌ ఛాంపియన్‌ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. దీంతో భారత్ ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.

- Advertisement -

ప్రస్తుతం ఆర్చరీ వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా ఆరు పతకాలను దక్కించుకుంది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా.. మరొకటి రజతం ఉంది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌ సెమీఫైనల్లో దీపిక.. దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థిని ఢీకొట్టనుంది. మిక్స్‌డ్ టీమ్‌ కూడా రికర్వ్‌ విభాగంలో కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. ప్రపంచ నంబర్‌ 3 జ్యోతి వ్యక్తిగత ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. దీంతో తెలుగమ్మాయి అక్టోబరులో మెక్సికోలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement