Friday, April 26, 2024

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 315.13 పాయింట్లు లాభపడి 49,521.60 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 102.30 పాయింట్లు లాభపడి 14,925.45 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. అలాగే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉండదని కేంద్రం గతవారం స్పష్టం చేసింది. విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాలు సూచీల కదలికలకు దన్నుగా నిలుస్తున్నాయి. అయితే, దేశంలో భారీ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండడం, మెజారిటీ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడం, అంతర్జాతీయ సంస్థలు భారత జీడీపీ అంచనాల్లో కోతపెట్టడం వంటి అంశాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగానే వ్యవహరించే అవకాశం ఉంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 73.31గా ఉంది. ఎన్టీపీసీ, ఒఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, తదితర సంస్థలతోపాటు.. బ్యాకింగ్‌, ఐటీ, రంగాలు లాభాల్లో ట్రేడవుతుండగా.. మారుతీ, నెస్టిల్‌ ఇండియా, అల్ట్రాసిమెంట్‌ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement