Saturday, December 7, 2024

కరోనాతో మరో ప్రముఖ జర్నలిస్ట్ మృతి

కరోనా మహమ్మారి మరో జర్నలిస్టును బలి తీసుకుంది. ఇంటర్వ్యూల ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహారెడ్డి (TNR) కరోనాతో సోమవారం ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చనిపోయారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR’ అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. TNR మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టుల అసోసియేషన్ కూడా సంతాపం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు మీడియా సంస్థలకు చెందిన వందలాది మంది జర్నలిస్టులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఆసక్తితో దర్శకత్వంపై ఆసక్తితో టీఎన్ఆర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమాన నటుడు. 1992లో దేవదాస్‌ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు. స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ వద్ద సహాయకుడిగా పనిచేశారు. పలు చిత్రాలకు రచనా సహకారం అందించారు. తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్నా, దర్శకుడిగా, రచయితగా సినిమాల వైపు రాకుండా బుల్లితెరకు వెళ్లారు. పలు న్యూస్‌ ఛానళ్లలో విలేకరిగానూ పనిచేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement