Sunday, April 28, 2024

పరశురామ కృష్ణమూర్తి…పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలలో నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యప్పన్ కోసం రీమేక్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని టైటిల్ ని గానీ అనౌన్స్ చేయలేదు చిత్ర యూనిట్.

కాగా తాజాగా టైటిల్ పై ఓ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రానికి పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఫిల్మ్ నగర్ లో మాత్రం ఈ టైటిల్ నే ఫిక్స్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement