Wednesday, May 22, 2024

క్రేజీ న్యూస్: చిరంజీవి సినిమాలో గ‌ద్ద‌ర్..!

ప్రజాగాయకుడు గద్దర్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. చిరు లూసిఫ‌ర్ చిత్ర రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకొచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలోని ముఖ్య పాత్ర‌కోసం గ‌ద్ధ‌ర్‌ని సంప్ర‌దించార‌ని ఆయ‌న కూడా ఆ పాత్ర‌లో న‌టించేందుకు ఓకే చెప్పార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో ఆయన పాల్గొననున్నారట. ఆయనతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను ఈ సినిమాలో భాగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. తాజాగా వైజాగ్ షెడ్యూల్ జ‌ర‌గాల్సి ఉండ‌గా, సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా డేట్స్ కుదరకపోవడంతో కొద్దిరోజులు వాయిదా పడింది.

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ బాణీలు కడుతున్నారు. ఇకపోతే యాంకర్ అనసూయ, నయనతారలతో పాటు బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ కూడా నటిస్తున్నారని స‌మాచారం అందుతుంది.ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు త్వ‌ర‌లో భోళా శంక‌ర్, బాబీ సినిమాలు చేయ‌నున్నాడు.

ఇది కూడా చదవండి: ఓబులమ్మ సాంగ్ @కొండపొలం

Advertisement

తాజా వార్తలు

Advertisement