Wednesday, May 8, 2024

ఆ స్టార్ హోటల్ లో 3 వేలకు చిన్న రొట్టెముక్క పెట్టారు..

కొన్ని కొన్ని సార్లు ఫైవ్ స్టార్ హోటల్లో తినడం కన్న వీధుల్లో బండిపై తినడం మేలు అన్న సంగతి ఎప్పుడో ఒకసారి ఎదురై ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ఇంగ్లండ్ లో ఓ యువతికి ఎదురైంది. ఓ మహిళ రెస్టారెంట్‌కు వెళ్లి మెనూలో చూసి 3 వేల రూపాయల ఫుడ్ ను ఆర్డ‌ర్ చేసింది. ఎంత మంచి భోజ‌నం వ‌స్తుందో అని ఆతృత‌గా ఎదురు చూసిన ఆ మ‌హిళ‌కు రెస్టారెంట్ షాకిచ్చింది.  ఓ చిన్న రోట్టే, చిన్న స్వీట్ ముక్క‌, మరొక చిన్న ప‌దార్ధం తీసుకొచ్చి ముందు పెట్టారు.  దానిని చూసి ఆమె షాక్ అయింది.  ఏం చేయాలో తెలియ‌క బిక్క‌ముఖం పెట్టింది.  ఫుడ్ ఆర్డ‌ర్‌ను ఫొటోగా తీసి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది.  30 పౌండ్లు పెట్టి ఫుడ్ ఆర్డ‌ర్ చేస్తే క‌నీసం చిన్న పిల్ల‌ల బ్రేక్ ఫాస్ట్ అంత‌కూడా లేని రొట్టె ముక్క‌ను ముఖాన ప‌డేశార‌ని వాపోయింది.  అందుకే మెనూలో ఉన్న ఖ‌రీదైన ఫుడ్‌ను కాకుండా సింపుల్‌గా త‌క్కువ‌గా ఉండే ఫుడ్‌ను ఆర్డ‌ర్ చేసుకోవాల‌ని నెటిజ‌న్లు హిత‌బోధ చేశారు.  ఈ సంఘ‌ట‌న లండ‌న్‌లోని షార్డ్ బిల్డింగ్‌లో ఉన్న హోట‌ల్‌లో జ‌రిగింది.  

https://twitter.com/raveen__x/status/1430580433503326213

ఇది కూడా చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పీవీ సింధుకు ఘన సత్కారం

Advertisement

తాజా వార్తలు

Advertisement