Monday, May 6, 2024

తెలంగాణలో 300 లకు దిగువన కరోనా కేసులు..

తెలంగాణ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ లో గడిచిన 24 గంటల్లో 58,335 కరోనా పరీక్షలు నిర్వహించగా, 257 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 409 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,57,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,47,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు దిగువన నమోదైంది. తాజా గణాంకాల నేపథ్యంలో రాష్ట్రంలో 5,912 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా మృతుల సంఖ్య 3,870కి పెరిగింది. ఇక అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 87 కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: స్కిప్పింగ్ ఆడిన కేంద్ర మంత్రి

Advertisement

తాజా వార్తలు

Advertisement