Sunday, May 19, 2024

TS | నా పోరాటం కొనసాగుతుంది : క్రీశాంక్

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జి క్రిశాంక్‌ను మే1న పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిశాంక్ కు 14రోజులు పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో క్రిశాంక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. తాజాగా, చంచ‌ల్‌గూడ జైలు నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్ లేఖను విడుదల చేశారు.

‘‘నా అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడినందుకు బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు అని… ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు నాకు మద్దతుగా నిలిచి నాలో ధైర్యాన్ని నింపారు అని అన్నరు. నాకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులందరికీ, దీనిని కవర్ చేస్తున్న జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు. నా పోరాటం కొనసాగుతుంది. ఓయూ ఒరిజినల్ సర్క్యులర్ ని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. నా లెటర్ ఫోర్జరీ అని రుజువైతే ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి నకిలీ లెటర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని’’ క్రిశాంక్ తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement