Monday, May 13, 2024

వైరల్ వీడియో: స్కిప్పింగ్ ఆడిన కేంద్ర మంత్రి

కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ కార్యక్రమంలో తన స్కిప్పింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఆదివారం నాడు ఫిట్ ఇండియా మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అలవోకగా స్కిప్పింగ్ చేస్తూ, అందులో పలు విన్యాసాలు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు చప్పట్లతో ఆయన్ను ప్రోత్సహిస్తుండగా, మరింత హుషారుగా స్కిప్పింగ్ చేస్తూ ఫిట్ నెస్ ఆవశ్యకతను చాటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఫిట్ ఇండియా యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరు తమ ఫిట్ నెస్‌ను పరీక్షించుకునేందుకు వీలుగా ఈ యాప్‌కు రూపొందించారు.

ఈ వార్త కూడా చదవండి: భాష మన మూలాలను తెలియజెప్పి నడిపే సారధి: వెంకయ్య నాయుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement