Monday, July 22, 2024

GT vs KKR | గుజరాత్ – కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం అంతరాయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటన్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. 7 గంటలకు టాస్‌ వేయాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో స్టేడియం సిబ్బంది పిచ్‌పై కవర్స్‌తో కప్పి ఉంచారు.

వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్…. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోల్‌కతా ఉంది. ఇక దాదాపు నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించిన గుజ‌రాత్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువుకాపాడుకోవాలని భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement