Tuesday, July 23, 2024

Gnaneshwari : న‌డుము మ‌డ‌త‌ల‌లో సోగ‌సు…

‘పెళ్లి చూపులు’.. ఆ మధ్య తెలుగులో వచ్చిన ఈ షో గుర్తుందా? 14 మంది అమ్మాయిలతో యాంకర్ ప్రదీప్ లీడ్ గా ఆ షోను ఒక ఛానల్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ షో టైటిల్ ను తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కాండ్రేగుల సొంతం చేసుకుంది. ! ఇక షార్ట్ ఫిల్మ్‌ లు చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేసిన జ్ఞానేశ్వరి.. పెళ్లి చూపులు షోతో పాపులర్ అయింది.

ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంది. హీరోయిన్‌ గా ‘మిస్టర్ అండ్ మిస్’ మూవీ చేసింది. ఆ తర్వాత ‘నీ జతగా’, ‘మాయలో’, ‘చక్రవ్యూహం’ వంటి పలు చిత్రాల్లో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ.

- Advertisement -

తన ఫాలోయింగ్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటోంది తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసి.. అందరి చూపు తనవైపు తిప్పుకుంది జ్ఞానేశ్వరి కాండ్రేగుల. ‘మీ కళ్ళలోకి తిరిగి చూస్తున్నాను!’ అంటూ క్యాప్షన్ ఇచ్చి వయ్యారాలు ఒలకబోసింది. అందాలన్నీ కనిపించేలా శారీ కట్టుకుని మాయ చేస్తోంది.

నడుము మడతపై వడ్డాణం పెట్టుకుని.. అందరి ఫోకస్ అక్కడ పడేలా హోయలు ఒలికిస్తోంది. ఓరగా చూస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి పిక్స్ చూసిన కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు. నడుమును మరీ అంత వయ్యారంగా చూపించాలా అమ్మడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement