Wednesday, May 22, 2024

Janhvi Kapoor : క‌ట్టిందేమో ఎర్ర చీర

అందాల జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. క్రికెట్ నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామా ఇదని జాన్వీ ప్ర‌చారం చేస్తోంది. ఇటీవ‌ల ఐపీఎల్ మ్యాచ్‌లు స‌హా వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా జాన్వీక‌పూర్ త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తోంది.

మహి ప్ర‌చారానికి స్పంద‌న అద్భుతం. మ‌రోవైపు మ‌హి థీమ్డ్ డిజైన‌ర్ డ్రెస్ లు కుర్ర‌కారు హృద‌యాల్ని హ‌త్తుకుంటున్నాయి. తాజాగా జాన్వీ క‌పూర్ ధ‌రించిన‌ డిజైన‌ర్ శారీ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎర్ర కోక.. బులుగు అంచు.. కాంబినేష‌న్ ఎరుపు రంగు డిజైన‌ర్ ర‌వికెలో జాన్వీ ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.

జాన్వీ మునుప‌టి కంటే సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement