Sunday, May 19, 2024

T20 World Cup | ఉంగాండా జట్టుకు మసాబా కెప్టెన్..

ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్ మ‌రో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా, వెస్టిండీస్ – అమెరికా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటుండగా… ఆయా దేశాలు ఇప్పటికే టోర్నీలో పాల్గొనే 15 మంది స‌భ్యుల‌తో కూడిన‌ త‌మ స్క్వాడ్స్‌ను ప్ర‌క‌టించాయి. ఇక తాజాగా, ఈ మెగాటోర్నీలో అరంగ్రేట్రం చేస్తునున్న ఉంగాండా… తమ జట్టును ప్రాకటించింది.

టోర్నీకి అర్హత సాధించేందుకు జరిగిన క్వాలిఫయర్స్‌లో జింబాబ్వేను మట్టికరిపించిన ఉంగాండా… టీ20 వరల్డ్ కప్ గ్రూస్ స్టేజ్‌లో.. వెస్టిండీస్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్‌లతో కలిసి గ్రూప్ సిలో స్థానం పొందింది. ఇక బ్రియాన్ మసాబా నాయకత్వంలోని జట్టు.. జూన్ 3న గయానాలో జరిగే తమ ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది.

ఉగాండా టీ20 ప్రపంచ కప్ జట్టు..

బ్రియాన్ మసాబా (c), సైమన్ స్సేసాజి, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యువుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేష్ రంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ సెనియోండో, బిలాల్ హస్సన్, రాబిన్సన్ ఒబుయా, రియాజత్ అలీ షా (vc), జుమా మియాజీ, రోనక్ పటేల్.

ట్రావెలింగ్ రిజర్వ్‌లు : ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా

Advertisement

తాజా వార్తలు

Advertisement