Sunday, May 19, 2024

కుసుమస్తక న్యాయము

కుసుమ అనగా పువ్వు, పుష్పము, విరి, సుమము. మస్తక అనగా తల, శిరస్సు, మాడు, ఉపరి భాగము అనే అర్థాలు ఉన్నాయి. పూలగుత్తి మ హళల తలమీద అలంకారముగానైనా ప్రకాశిస్తుంది. లేదా రాలిపోతుంది అని అర్థ ము. అంతేకాదు భగవంతుని కంఠంలోనో, పా దాలు మీదనో వినయంగా ఒదిగిపోతుంది.
సజ్జనుడిని పువ్వుతో పోల్చడం జరిగింది. పూవు ఏవిధంగా అయితే కొమ్మలపై అగ్రమ స్థానంలో ఉం టుందో సజ్జనుడు కూడా ఊరిలో తలమానికంగా ఉం టాడు. పూవు ఏ విధంగా రాలిపోయేంత వరకు పరిమళం వీడకుండా ఉంటుందో, సజ్జనుండు స్వస్థానమును వది లి, అడవిలో తపస్సుకు వెళ్ళినా తన గుణ ధర్మాలను వీడ డు అనే అర్థముతో మన పెద్దలు ఈ ”కుసుమస్తక న్యాయ ము”ను ఉదాహరణగా చెబుతుంటారు.
పువ్వులు వివిధ రంగులతోనూ, వివిధ సువాసనలు కలిగి అందంగా కనిపిస్తూ, మనస్సుకు ఆనందం కలిగిస్తా యి. ప్రకృతి ఒడిలో పుష్పించే మొక్కలు ప్రకృతికే అందా న్ని ఇస్తుంటాయి. కొన్ని పువ్వులు స్నేహానికి, కొన్ని పువ్వు లు ప్రేమకు, మరికొన్ని క్షమాపణ అడగడానికి, మరి కొన్ని మరణానికి గుర్తుగా చెప్పబడతాయి. గులాబీ

పువ్వును ప్రేమకు గుర్తుగా, మల్లెపువ్వును స్వచ్ఛతకు, స్నేహా నికి గుర్తుగా చెబుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు లక్షల రకాల పుష్పించే మొక్కల జాతులున్నాయి.
అంతేకాదు పువ్వులకు తరతమ భేదం లేదు చూసే ప్రతి ఒక్కరి కళ్ళకు అందాన్ని, ఆనందాన్ని పంచుతాయి. పూలను దైవారాధనలో, పంచ ఉపచార పూజలో ఆకాశ తత్వానికి ప్రతీకగా పూవును ఉపయోగిస్తారు. అలాగే ప్రా ణానికి చి#హ్నంగా పువ్వును భగవంతునికి సమర్పించవచ్చ ని వేదం చెబుతోంది. అదేవిధంగా భగవంతుని అర్చనలో వేటిని అర్పించాలో అన్నమయ్య రాసిన పద్యం…. భవ దీయార్చన సేయుచో బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం/ డవ పుష్పంబు దయాగుణం, బతి విశిష్టం బేక నిష్ఠా సమో/త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వ ద్భక్తి సంయుక్తి యో/గ విధానం బవి లేని పూజల మదిం గైకోవు సర్వేశ్వరా!”
సర్వేశ్వరా! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ, మూడో పుష్పం మిక్కిలి విశి ష్టమైన ఏకాగ్రత. ఇది భక్తి యోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేనిదే నీవు అంగీకరింపవు కదా! అంటూ సత్యం, దయ, ఏకాగ్రతలను పువ్వులతో పోల్చి అవి దైవ పూజలో తప్పకుండా ఉండాలని అంటారు. కవులు ఎందరో పువ్వుల మీద అద్భుతమైన కవితలు, గేయాలు పాటలు రాశారు.
పువ్వులు బతికేది మూన్నాళ్ళయినా నేల రాలే చివ రి క్షణం వరకూ పరిమళాలు వెదజల్లుతూనే, పరులకు తమ దైన సేవ చేస్తూ వుంటాయి. అందుకే పువ్వులా తలెత్తుకుని జీవించాలి. పరులకు ఆనందాన్ని కలిగించాలి. జీవితా న్ని త్యాగం చేయాలి. ”కుసుమస్తక న్యాయము” ద్వారా మనం నేర్చుకోవలసింది జీవిత సత్యం ఇదే.
ముళ్ళకంచెలోంచి కూడా నవ్వుతూ వికసించే పు వ్వే మన ఆదర్శం కావాలి. కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా పెదవులపై పువ్వులాంటి చిరునవ్వును వీడకుండా చూసుకో వాలి. అప్పుడే పూల హృదయం, దైవత్వం పూల దండలో దారంలా మనకూ అబ్బు తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement