Sunday, May 19, 2024

TS | భారీ వర్షం, కూలిన రైజ్ నిర్మాణ కంపెనీ గోడ.. చిక్కుకున్న కార్మికులు

కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ బాచూపల్లిలో ఓ నిర్మాణ సంస్థ ప్రహరి గోడ కూలి పలువురికి గాయాలయ్యాయి. బాచూపల్లిలో రైజ్ అనే నిర్మాణ సంస్థ బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మిస్తుంది. భారీ ప్రహరీ గోడకు అనుకుని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో కంపెనీలో పనిచేసే కూలీల కోసం రైజ్ సంస్థ తాత్కాలిక షెడ్లతో రూములను నిర్మించింది.

అయితే, మంగళవారం కురిసిన భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలి కార్మికుల కోసం నిర్మించిన తాత్కాలిక రూములపై పడిపోయింది. దీంతో ఆ రూముల్లో ఉన్న వారంతా కూలిన ప్రహరిగోడ కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణ రక్షణ చర్యలు చేపట్టారు.

సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు…

భారీ వర్షం కారణంగా బాచూపల్లిలోని రైజ్ నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ ప్రహరీ గోడ కూలీల కోసం నిర్మించిన షెడ్ల పై కూలడంతో ప్రమాదవశాత్తు కార్మికులు మట్టికుప్పల కింద చిక్కుకుపోయారు.. సమాచారం తెలుసుకున్న బాచూపల్లి సీఐ ఉపేందర్ తక్షణ మరమ్మత్తు చర్యలు చేపట్టారు. మట్టి కుప్పలు కింద చిక్కుకున్న 6 కార్మికులను రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యల్లో భాగంగా మట్టి తవ్వకాలు చేస్తుండగా ఓ కూలి మృతదేహం బయటపడింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఇంకా ఎంత మంది క్షతగాత్రులు మట్టి కుప్పల కింద ఉన్నారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement