Wednesday, July 24, 2024

IPL Qualifier1 | చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ఫైనల్స్‌కు కేకేఆర్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా జరిగిన తొలి క్వాలిఫయర్ లో కోల్‌కతా జట్టు ఘ‌న‌విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో స్వల్ప పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్‌కు చేరుకుంది.

ఇక 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు గుర్భాజ్ (23), సునీల్ నరైన్ (21) పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ (51 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (58 నాటౌట్) చెలరేగిపోయారు. ఎస్ఆర్‌‌హెచ్ బౌలర్లపై చెరో హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డారు. దీంతో 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement