Friday, April 26, 2024

కేజీఎఫ్ 2 రన్ టైం ఎంతో తెలుసా ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తాలూకా మొత్తం రన్ టైం 02:52 వచ్చిందట. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటన రాలేదు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement