Friday, April 19, 2024

కరోనా తగ్గలేదు.. కానీ కండోమ్స్ కోసం ఎగబడుతున్న కుర్రాళ్లు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా పలు వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. పలు రంగాల కంపెనీలకు కరోనా కాలంలో కొనుగోళ్లు కూడా తగ్గాయి. వాటిలో కండోమ్స్ ఒకటి. కరోనా కారణంగా వీటి కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. ఎక్కడ సెక్స్ చేస్తే కరోనా అంటుకుంటుందో అని యువత శృంగారానికి దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కండోమ్స్ కొనుగోళ్లు పుంజుకున్నాయని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. చైనా, అమెరికా దేశాల్లో కండోమ్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా సమయంలో మాత్రం వీటికి డిమాండ్ లేకపోవడంతో స్టాక్ మిగిలిపోయి చెత్తకుప్పలో పడేశారు. అయితే ఇంకెన్నాళ్లు ఇలాగే ఉండాలి.. ఏదైతే అది అయిందని చాలామంది యువత శృంగారం వైపు మొగ్గు చూపుతున్నారట. ఈ నేపథ్యంలోనే చైనా, అమెరికా దేశాల్లో కండోమ్స్ వినియోగం మళ్లీ బాగా పెరిగిందని కండోమ్స్ తయారీ కంపెనీలు తెలుపుతున్నాయి.

మరోవైపు ఆయా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్నాం కదా.. తమకు ఏం కాదనే భావనలో యువత ఉందని, అందుకే ఏడాది నుండి ఎదురుచూస్తున్న వారు శృంగారానికి సై అంటున్నారని తెలిపింది. ఎక్కువగా 18 నుంచి 24 ఏళ్ల వయసు వారు కండోమ్స్ కొనుగోలు చేస్తుండటంతో కరోనా వల్ల ఏడాదిగా నష్టాల్లో కూరుకుపోయిన కండోమ్ కంపెనీలు ఇప్పుడు మళ్లీ కోలుకునే అవకాశం కనిపిస్తోంది. అటు ఇతర దేశాలతో పాటు ఇండియాలో కూడా నెమ్మదిగా కండోమ్స్ వాడకం పెరుగుతుందని పలు కంపెనీలు వెల్లడిస్తున్నాయి. కాగా వ్యాక్సిన్ వేయించుకున్నవారు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement