Tuesday, September 28, 2021

నేటి సంపాదకీయం – ప్రాంతీయతకే పట్టం

తెలుగు రాష్ట్రాలకూ,పుదుచ్చేరి అసెంబ్లి కీ జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలి తాలు రాకపోయినా, ఎన్నడూ లేనిది పుదుచ్చేరిలో అధికారాన్ని చేజిక్కించుకోవ డం విశేషమే. అసోంలో అధికారాన్ని నిలబెట్టుకున్న ఆ పార్టీ బెంగాల్‌లో అధికా రం కోసం హోరాహోరీగా పోరాడి ఓడినా చెప్పుకోదగిన స్థానాలను సంపాదించు కుంది.కాంగ్రెస్‌,వామపక్షాలను దెబ్బతీసింది.కేరళలో ఇమేజ్‌ పెంచుకునే క్రమం లో మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధుడైనశ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీజేపీ ముందే ప్రకటించి, శబరిమల పవిత్రత పరిరక్షణ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. తమిళనాడులో ద్రవిడ పార్టీల ద్వంద్వయుద్ధంలో నలిగిపోయింది. బీజేపీ కర్నాటకలో మినహా దక్షిణాదిలో కాలు మోపడానికి జరుపుతున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున సాగర్‌ అసెంబ్లికీ, తిరుపతి లోక్‌సభకూ జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ పై ఉత్తరాది పార్టీగా ఉన్న ముద్ర ప్రధాన కారణంగా భావించవచ్చు. తెలంగాణలో దుబ్బాక అసెంబ్లి స్థానానికి కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపొందడం తో ఆ ఉత్సాహంతో నాగార్జున సాగర్‌లో గెలుపొందేందుకు ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం జరిపినా ఫలించలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్శిమయ్య మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్‌ని తెరాస నిలబెట్టింది.కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి, బీజేపీ అభ్యర్ధి బరిలో ఉన్నా తెరాసకే ప్రజలు పట్టం కట్టారు. అలాగే, తిరుపతి లోక్‌ సభ స్థానానికి వైకాపా అభ్యర్థి గురుమూర్తి రాజకీయాలకు కొత్త వాడైనా, పార్టీ మద్దతుతో గెలుపొందగలిగారు. ఈ ఎన్నికల్లో సీనియర్‌లు, జాతీయ పార్టీల నాయకులనూ ప్రజలు పట్టించుకోలేదు. బెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న మార్క్సిస్టు పార్టీ ఈ సారి ఘోరపరాజయాన్ని చవి చూడటం వామపక్ష భావజాలం గలవారు జీర్ణించు కోలేకపోతున్నారు. కేరళలో కూడా ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ వ్యక్తిగత ప్రతిష్ఠ, పాలనా సామర్ధ్యం కారణంగానే ఆయన నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చి నలభై సంవత్సరాల చరిత్రను తిరగరాసింది. బీజేపీ తరఫున ప్రచారా న్ని నిర్వహించేందుకు గతంలోమాదిరిగా వాగ్ధాటి, అనుభవంగల నాయకులెవరూ లేక పోవడం ఆ పార్టీకి కొరతగానే ఉంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌ షాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే, మధ్యలో సమయం కుదుర్చుకుని వచ్చి ఈ రాష్ట్రాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఏ ప్రాంతమైనా, ప్రజలు ఎన్నికల కూ, లోక్‌సభకూ అభ్యర్ధులను ఎన్నుకోవడంలో తమ వివేచనను ఉపయోగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ సమస్యల ప్రాధాన్యం ఉన్నందున జాతీయ పార్టీలవైపే మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లి ఎన్నికల్లో స్థానికసమస్యలకే ప్రాధాన్యం ఇస్తూ ప్రాంతీయ పార్టీల కు పట్టం కడుతున్నారు. కేరళలో లోక్‌సభఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీని ఎన్నుకోవడం ద్వారా ఈ వివేచననే ప్రదర్శించారు. పార్లమెంటుకూ, అసెంబ్లిలకూ ఎన్నిక లు వేర్వేరుగా జరుగుతూ ఉండటం వల్ల ప్రజలు తమ తీర్పులో కూడా ఈ తేడాను చూపడా నికి అవకాశం కలుగుతోంది. దేశంలో ఎక్కువ కాలం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నంత కాలం ఈ సమస్య తలెత్తలేదు. ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరిగిన తర్వాత రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గింది. ప్రాంతీయ సమస్యలను జాతీయ పార్టీలు పట్టించుకోవడం లేదన్న కారణంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలన్నింటిని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ కూటమి కూడా ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతోనే ప్రభుత్వాన్ని నడిపింది. వీటి వల్ల అవి ఎదుర్కొన్న ఇబ్బందుల ను దృష్టిలో పెట్టుకునే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదనను ప్రధాని మోడీ చర్చకు తెచ్చారు. అయితే, దానిపై చర్చ ప్రారంభం కాలేదు. దీనిపై ఏకాభిప్రాయం రాకపోవడమే ఇందుకు కారణం. ఈ లోగా కరోనా మహమ్మారి విజృంభణతో ఇలాంటి ప్రతిపాదనలెెన్నో తెరవెనుకకు వెళ్ళాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News