Friday, April 26, 2024

బన్నీ పై చెర్రీ మరోసారి పైచేయి!!

కొన్నిసార్లు థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలకు బుల్లితెరపై ఆదరణ కరువవుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు థియేటర్స్ లో ప్లాప్ అయిన సినిమాలకు బుల్లితెరపై ఆదరణ పెరుగుతుంది. ఉదాహరణకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ అలాగే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురము లో. అసలు విషయానికొస్తే ఇటీవల అలా వైకుంఠపురములో సినిమా నాలుగవ సారి టీవీ ఛానల్లో ప్రసారం అయింది. అయితే దానికి టిఆర్పి రేటింగ్ 4.98 వచ్చింది.

మరోవైపు వినయ విధేయ రామ సినిమా 19 వ సారి టెలికాస్ట్ అయింది. ఈ సినిమాకు 4.96 టిఆర్పి రేటింగ్ వచ్చింది. దాదాపుగా రెండు కూడా సమానంగా వచ్చినట్టే. కానీ 4వ సారికి 19వ తారీఖు చాలా తేడా ఉంది. దీంతో సినీ అభిమానులు అల్లు అర్జున్ పై రామ్ చరణ్ పైచేయి సాధించడంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement