Thursday, May 2, 2024

నేనే మహానటిని అంటోన్న ‘కంగనా’

బాలీవుడ్ బ్యూటీ  కంగనరనౌత్  ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ తలైవిలోనూ, యాక్షన్‌ మూవీ థాకడ్లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లూ చివరి దశకు చేరుకున్నాయి. ఈ రెండు సినిమాల పోస్టర్లనూ కంగన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ తన కంటే గొప్ప నటి మరొకరు లేరని మురిసిపోయింది. నా స్థాయిలో నటించగలిగే మరో నటి ప్రస్తుతం ఈ భూమి మీద లేదు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన మెర్లీ స్ట్రీప్‌లో ఉండే ప్రతిభ నాలో ఉంది. అలాగే ఇజ్రాయిల్‌ ప్రముఖ నటి గాల్ గాడోట్‌లా యాక్షన్‌ చేయగలను. గ్లామరస్‌గానూ కనిపించగలనని కంగన ట్వీట్ చేసింది.  కంగన చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. మీమ్‌లు, సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కంగన మరోసారి స్పందిస్తూ.. `నువ్వు ఎన్ని ఆస్కార్‌లు సాధించావు అని నన్ను అడుగుతున్న వారందరికీ ఒకటే ప్రశ్న.. మెరిల్ స్ట్రీప్ ఎన్ని జాతీయ అవార్డులు సాధించింది.. ఎన్ని పద్మ అవార్డులు సాధించింది,, ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. మీ బానిస మనస్తత్వం నుంచి బయటపడండి. మీ అందరికీ కాస్త ఆత్మ గౌరవం కావాలని పేర్కొంది. అలాగే మరో ట్వీట్‌లో హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూస్ కంటే తనే గొప్పగా స్టంట్లు చేయగలనని పేర్కొంది. కాగా, కంగన ట్వీట్లపై నెటిజన్లు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు. ఇంతకంటే గొప్ప గొప్ప నటీమణులే ఉన్నారు ఇండస్ట్రీలో అయినా ఈమె గురించి ఈమె పొగుడుకోవడం ఏంటని తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి కంగనా ఏమంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement