Friday, April 26, 2024

‘ఉప్పెన’ వంద కోట్ల సినిమా

ఉప్పెన వంద కోట్ల సినిమా అని రుజువు కానుందని తెలిపారు డైరెక్టర్ సుకుమార్.మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సుకుమార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లలో విడుదలై హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. చిత్రానికి వస్తోన్న ఓపెనింగ్స్‌, టాక్‌తో సంతోషంగా వ్యక్తం చేస్తూ.. మేకర్స్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ”సినిమా రిలీజ్ అయిన అన్నిచోట్ల నుంచి యునానిమస్ హిట్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు చాలా చాలా థాంక్స్. నాకు ఇది అద్భుతమైన క్షణం. ఒక శిష్యుడు గురువుని చేసిన రోజు ఇది. ఉప్పెన లాంటి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను నిజమైన గురువుని చేసాడు బుచ్చి. చాలా గొప్పగా ఫీలవుతున్నాను. నేను ఎప్పుడూ ఎరా, ఏంట్రా బుచ్చి అని పిలిచేవాడ్ని.. కానీ ఈ సినిమా చూసి బయటికి వచ్చి ఎరా బుచ్చి అని పిలవటానికి సంకోచించి.. బుచ్చి అన్నాను.. అదే ఈ సినిమా సక్సెస్ కి నిదర్శనం. ఒక డైరెక్టర్‌గా నాకు బుచ్చిమీద అంత రెస్పెక్ట్ వచ్చేసింది. తను రాసుకున్న కథని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఒక కొత్త డైరెక్టర్ లా చేసినట్టు లేదు. ఎంతో ఎక్స్ పీరియెన్స్ ఉన్న డైరెక్టర్‌లా ‘ఉప్పెన’ చిత్రాన్ని వండర్ ఫుల్‌గా తీశాడని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement