Friday, April 26, 2024

త‌మిళ‌నాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు – 11 మంది మ‌ర‌ణం..

తమిళనాడు విరుధానగర్​జిల్లా అచ్చంకుళం గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగి 11 మంది మరణించారు. 12 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పది అగ్నిమాపక యంత్రాలతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాణసంచా తయారు చేయడానికి రసాయనాలు కలుపుతుండగా పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. గాయ‌ప‌డిన వారంద‌రిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మోడీ దిగ్భ్రాంతి

బాణసంచా పేలుడు ఘ‌ట‌న‌పై ప్రధాని నరేంద్ర మోడీవిచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం అందిస్తాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అలాగే క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య స‌హాయం అందేలా చూడాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement