Thursday, May 16, 2024

మళ్లీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లు పెరగొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఈరోజు ఆచితూచి ట్రేడింగ్ చేశారు. నష్టాల్లో కొనసాగుతున్న అమెరికా మార్కెట్ల ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 471 పాయింట్లు కోల్పోయి 48,690కి పడిపోయింది. నిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి 14,696 వద్ద స్థిరపడింది. కమొడిటీ ధరలు దూసుకెళ్లడంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ద్రవ్యోల్బణ భయం, కమొడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు, బాండ్ల రాబడులు పెరగొచ్చన్న అంచనాలతో నేడు అప్రమత్తంగా కదలాడాయి. వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు, కొవిడ్‌ భయాలు మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీశాయి.

సెన్సెక్స్‌ 30 జాబితాలో టైటన్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్ షేర్లు లాభాల్లో పయనించగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement