Monday, April 29, 2024

హర్భజన్ సింగ్ కు సోను సూద్ హెల్ప్

సోనుసూద్ గతేడాది కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి దేవుడయ్యాడు. వారి హృదయాలను గెలుచుకున్నాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి సహాయసహకారాలు అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. సామాన్య ప్రజలకే కాకుండా ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా సహాయం చేస్తున్నాడు. మొన్న క్రికెటర్ రైనా కు అలాగే టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కు సహాయం చేశాడు.

తాజాగా టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు కూడా సహాయం చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గ లో మెడిసిన్ అత్యవసరంగా కావాలని ట్విట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ కు సోనుసూద్ స్పందించారు..మీరు అడిగిన మందులు త్వరలో చేరుకుంటాయి అని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: అల్లు అర్జున్ కు నెగిటివ్… ఫ్యామిలీతో కలిసి…

Advertisement

తాజా వార్తలు

Advertisement