Thursday, May 16, 2024

గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్

కరోనా కేసుల కారణంగా చాలా మంది ఆస్పత్రులలో బెడ్స్, ఆక్సిజన్ లభ్యత వంటి అంశాలకు సంబంధించిన సమాచారం కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ విధానం ఇప్పటికే జరుగుతూ ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను ఇందుకు సెలెక్ట్ చేసి…అక్కడే ప్రయోగం చేయనున్నారు. మనకు అతి కొద్ది దూరంలో ఉన్న హాస్పిటల్స్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. కానీ హాస్పిటల్స్ వివరాలను తెలుసుకునే పద్ధతి ఇది వరకే అందుంబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే వీరు కొంచెం కొత్తగా అలోచించి ఆయా ఆస్పత్రుల్లో బెడ్స్ స్టేటస్ సమాచారం కూడా తెలుసుకునే విధంగా డిజైన్ చేయనున్నారు.

ఒక్కోసారి ఇటువంటి సమాచారం మనకు దగ్గరి వాళ్ళో లేదా ఆస్పత్రుల్లో ఉన్న వారో చెబుతూ ఉంటారు. అయితే ఆ సమాచారం సరి అయినదా కాదా తెలుసుకోవడానికి కూడా ఆ పద్దతిని ఉపయోగించి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అని తెలుస్తోంది. అయితే ఇదే వివరాలు ఇప్పటికే గూగుల్ లో ఉన్న గూగుల్ క్యు అండ్ ఏ అనే ఫీచర్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ గూగుల్ మ్యాప్స్‌లో ఇంకా కరోనాకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించి ఉన్నారు. కాబట్టి ఈ గూగుల్ ఫీచర్‌ను సరిగ్గా ఉపయోగించుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా వ్యాక్సిన్ ప్రభావం, రిజిస్ట్రేషన్ వివరాలు, చికిత్స వివరాలను తెలుసుకోవచ్చు. ఈ సమాచారం కూడా గూగుల్ ముందుగా కేంద్ర ప్రభుత్వం నుండి కలెక్ట్ చేసి గూగుల్‌లో పొందుపరచనున్నట్లు తెలిపింది. ఒకవేళ గూగుల్ లేని కరోనా విషయాలను గురించి శోధిస్తే, అది వెంటనే కోవిన్ వెబ్ సైట్‌కు రీ డైరెక్ట్ చేస్తుంది. ఈ విధంగా గూగుల్ కరోనా సంబంధిత సమాచారాన్ని ప్రజలకు అందివ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement