Thursday, May 2, 2024

అల్లు అర్జున్ కు నెగిటివ్… ఫ్యామిలీతో కలిసి…

కరోనా బారిన పడిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తాజాగా కోలుకున్నారు. 15 రోజుల తర్వాత కోవిడ్ టెస్ట్ చేపించుకోగా నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. తనకు కొవిడ్ నెగిటివ్ వచ్చిందని వెల్లడిస్తూ ఆయన ట్వీట్ పెట్టారు. 15 రోజుల క్వారంటైన్ తర్వాత తన కుటుంబ సభ్యులను కలిశానని చెప్పారు. ఇన్ని రోజులు తన ఆరోగ్యం గురించి ప్రార్ధించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ బన్నీ ట్వీట్ చేశారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

అల్లు అర్జున్‌కు రెండు వారాల క్రితం క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి క్వారంటైన్‌లో ఉంటూ ఆయ‌న చికిత్స తీసుకున్నాడు. తాజాగా కోలుకున్నాడు. అల్లు అర్జున్‌ కి కరోనా నెగెటివ్ అని తెలిసి ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇది కూడా చదవండి: కొత్త పార్టీపై ఈటల సమాలోచనలు.. గులాబీలో గుబులు!

Advertisement

తాజా వార్తలు

Advertisement