Friday, May 17, 2024

TS: మ‌ళ్లీ కెసిఆర్ బస్సు యాత్ర‌కు రెడీ.. రీ షెడ్యూల్ ఇదే…

రీ షెడ్యూల్ విడుద‌ల చేసిన బిఆర్ ఎస్ పార్టీ
రేపు రాత్రి 8 గంట‌ల నుంచి తిరిగి ప్రారంభం
10వ తేది వ‌ర‌కూ షెడ్యూల్ విడుద‌ల

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48గంటల పాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు సాయంత్రం 8 గంటలకు గడువు ముగియనున్నది. గడువు ముగిసిన తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షో కొన‌సాగ‌నుంది.. తాజాగా కెసిఆర్ ప‌ర్య‌ట‌న రిషెడ్యూల్ చేశారు..

కేసీఆర్ బస్సుయాత్ర- రోడ్డు షో వివరాలు :
మూడో తేది సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్డు షో
నాలుగో తేది సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో
అయిదో తేది సాయంత్రం జగిత్యాల రోడ్డు షో
ఆరో తేది సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో
ఏడో తేది కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో
ఎనిమిదో తేదిన నర్సాపూర్ రోడ్డు షో.. అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో
తొమ్మిదో తేదిన కరీంనగర్ లో రోజు సాయంత్రం కరీంనగర్ లో రోడ్డు షో
10 వ తేదిన సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement