Thursday, May 16, 2024

వీవర్క్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. 10 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ

దీపావళీ సందర్భంగా వీవర్క్‌ కంపెనీ ఉద్యగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పండుగ సందర్భంగా తమ కుటుంబాలతో కలిసి హాయిగా, సంతోషంగా గడిపేందుకు ఉద్యోగులకు 10 రోజుల సెలవులు ప్రకటించింది. పండగ సమయంలో వారు సంతోషంగా గడిపేందుకే ఈ సెలవులు ఇచ్చినట్లు సంస్థ పీపుల్స్‌ అండ్‌ కల్చర్‌ విభాగాధిపతి ప్రీతి శెట్టి తెలిపారు. సెలవుల మూలంగా వారికి తగినంత విశ్రాంతి దొరుకుతుందని, ఫలితంగా పనిలో మరింత మెరుగ్గా పని చేసేందుకు ఉపయోగడపడుతుందని చెప్పారు. తమ కంపెనీ అంతర్గంతంగా నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకుందని, అందుకే ఉద్యోగులకు సెలవులను ఆఫర్‌ చేసినట్లు తెలిపారు.

వాస్తవానికి ఈ విధానాన్ని 2021లోనే ప్రారంభించారు. సత్ఫలితాలు ఇవ్వడంతో దీన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నారు.
ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ మీషో కూడా గత నెల ఉద్యోగులకు 11 రోజులు సెలవులు ప్రకటించింది. తమ సిబ్బంది మానసిక ఆరోగ్యం తమకు చాలా ముఖ్యమని అందుకే వారికి సెలవులు ఇచ్చినట్లు మీషో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement