Monday, May 27, 2024

TDP Protest – అక్టోబర్‌ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష.. రాత్రి కొవ్వోత్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న

నంద్యాల: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్‌ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. నంద్యాలలో ఇవాళ టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిణామాలు, తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్‌ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలన్నారు.

కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని చాలా మంది బాధపడుతున్నారని ఆ అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేక ఇప్ప‌టివ‌ర‌కు 97 మంది చనిపోయినట్టుగా తమకు సమాచారం ఉందని చెప్పారు. వారి కుటుంబాలకు తాము సంతాపం తెలుపుతున్నట్టుగా చెప్పారు. త్వరలోనే చనిపోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతామని అన్నారు. కాగా, ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇరు పార్టీల నుంచి కొంతమందితో కమిటీ ఏర్పాటు చేసుకుని . క్షేత్రస్థాయిలో పోరాడుతామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి 4 రోజుల పాటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారని.. ఇందులో టీడీపీ శ్రేణులు పాల్గొని సంపూర్ణ సహకారం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement