Sunday, June 9, 2024

TG | ప్రాణంతీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. అప్పు తీర్చలేక ఆత్మహత్య

అచ్చంపేట, ప్రభ న్యూస్ : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం కోట కుంటపల్లి గ్రామ శివారులోని తన సొంత మామిడి తోటలో శశాంక్ రెడ్డి(35) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లింగాల ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నంపల్లి మాజీ సర్పంచ్ వనజ, విష్ణువర్ధన్ రెడ్డి దంపతుల కుమారుడు శశాంక్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ అద్దె ఇంట్లో భార్యతో కలిసి ఉంటూ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్నాడు.

గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో లక్షల రూపాయలు పెట్టి అప్పుల పాలయ్యాడు. ఇంట్లో చెప్పుకోలేక అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శశాంక్ శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున లింగాల మండల పరిధిలోని కొత్తకుంటపల్లిలోని మామిడి తోటకు చేరుకున్నాడు. క్షనికమైన ఆవేశంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విష్ణు వర్దన్ రెడ్డి మామిడితోట వద్దకు వెళ్లి చూడగా కొడుకు చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతుడి తండ్రి విష్ణువర్ధన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై జగన్మోహన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement