Tuesday, June 11, 2024

TG | వైద్యం వికటించి యువకుడు మృతి.. వికారాబాద్‌లో ఘటన

వికారాబాద్ టౌన్, (ప్రభన్యూస్) : వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కెరెల్లి గ్రామానికి చెందిన సాయికుమార్ (29) గత మూడు రోజులుగా వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు అతన్ని డిశ్చార్జి చేయగా.. ఇంటికి వెళ్లిన అతను కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు.

వెంటనే యువకుడి బంధువులు అతడిన వికారాబాద్ పట్టణంలో చికిత్స పొందిన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పడంతో… మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఇలాంటి పరిస్థితి వచ్చిందని వాపోయారు. అనంతరం బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement