Sunday, June 16, 2024

Submarine | రెండో ప్రపంచ యుద్ధం నాటి సబ్‌మెరైన్‌ లభ్యం

వాషింగ్టన్‌ : అమెరికాకు చెందిన జలంతర్గామి ఒకటి దొరికింది. 80 ఏళ్ల క్రితం అమెరికా నేవీలో సేవలందించిన సబ్‌మెరైన్‌గా గుర్తించారు. ఈ జలంతర్గామి దక్షిణ చైనా సముద్రంలో కనుగొన్నారు. ఈ సబ్‌మెరైన్‌ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. రెండో ప్రపంచ యుద్థం సమయంలో అమెరికా నౌకాదళంలో యూఎస్‌ఎస్‌ హర్డర్‌ సబ్‌మెరైన్‌ విశేషమైన సేవలందించింది.

జపాన్‌ ఆక్రమణ నుంచి ఫిలిఫ్పీన్స్‌ను కాపాడేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన ఈ సబ్‌మెరైన్‌ 79 మంది సిబ్బందితో బయల్దేరి వెళ్లి సముద్రంలో కనిపించకుండా పోయింది. అయితే, సిబ్బందితో పాటు మునిగిపోయినట్లు అప్పట్లోనే భావించారు. కానీ, దానికి సంబంధించిన అవశేషాలు కానీ దొరకలేదు. కొన్నిరోజులపాటు దీనికి గురించి వెతికిన అధికారులు.. తర్వాత దాని సంగతి మరిచిపోయారు. అయితే, రెండు రోజుల క్రితం దీని శిథిలాలు దక్షిణ చైనా సముద్రంలో కనుగొన్నారు.

ఉత్తర ఫిలిఫ్పీన్స్‌ ద్వీపం లుజోన్‌ నుంచి 3000 అడుగుల వద్ద ఈ సబ్‌మెరైన్‌ను గుర్తించారు. కన్నింగ్‌ టవర్‌ వెనక ఉన్న జపనీస్‌ డెప్త్‌ చార్జ్‌ భాగంలో కొంత దెబ్బతిన్నట్లు గుర్తించారు. సంక్లిష్టమైన యుద్ధంలో హార్డర్‌ విజయం సాధించినప్పటికీ ఓటమిపాలైందని ఎన్‌హెచ్‌హెచ్‌సీ డైరెక్టర్‌, యూఎస్‌ నేవీ రిటైర్డ్‌ అడ్మిరల్‌ కూడా అయిన శామ్యూల్‌ జే కాక్స్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement