Sunday, June 16, 2024

IPL Final | చేతులెత్తేసిన సన్‌రైజర్స్‌.. కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్

చెన్నై చెపాక్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫైనల్‌లో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెతేశారే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌‌హెచ్ కుప్పకూలింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్లో అత్యల్ప స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది.

ఇక కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. దీంతో 114 పరుగుల టార్గెట్‌తో కోల్‌కతా జట్టు బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement