Saturday, June 22, 2024

TG | ఆరు ప్రాజెక్టులపై రెరా కొరడా.. కంపెనీలకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రేరా నిబంధనలు ఉల్లంఘించిన పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆరు కంపెనీలు రేరా అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. మియాపూర్‌ ప్రజ్ఞ ఎకోస్పెన్‌, చింతల్‌కుంట శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్‌, కొండాపూర్‌ నార్త్‌ ఈస్ట్‌ హెబిటీషన్స్‌, సంగారెడ్డి జిల్లా వి.ఆర్‌. ప్రమోటర్స్‌ అండ్‌ డెవలపర్స్‌, కెపిహెచ్‌బీ కాలనీ ఇన్వెస్టు ఇన్‌ ఫ్రా ప్రోజెక్టు, కొంపల్లి భారతి లేక్యూ టవర్‌ బిల్డర్స్‌ రేరా నిబంధనలు ఉల్లంఘించినందున 15 రోజుల లోగా సంజాయిషి సమర్పించాలని ఆదేశిస్తూ పోకాజు నోటీసులు జారీ చేసినట్టు రెరా అథారిటి పేర్కొంది.

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు రెరా రిజిస్ట్రేష్రన్‌ ఉంటేనే కొనుగోలుదారులకు భద్రత, భరోసా చేకూరుతుందని రేరె తెలిపింది. ఇల్లు, ఫ్లాట్‌ కొనాలి అనుకునే వారు రేరా రిజిష్టర్డు ప్రాజెక్టులలో మాత్రమే కొనుగోలు చేయాలని రెరా అథారిటి కొనుగోలు దారులకు సూచించింది.

ఫ్రీలాంచ్‌ ఆఫర్లను నమ్మి రెరా రిజిస్ట్రేషన్‌ లేని ప్రాజెక్టులలో కొని మోసపోరాదని రెరా అథారిటి విజ్ఞప్తి చేసింది. రేరా రిజిస్ట్రేషన్‌ పొందకుండా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, ఇతర స్థానిక సంస్థల అనుమతులు లేకుండా వ్యాపార ప్రకటనలు జారిచేయడం, మార్కెటింగ్‌కు పాల్పడటం రేరా చట్ట రీత్యా నేరమని అథారిటి స్పష్టం చేసింది.

కొనుగోలు చేసే ముందు ఆయా ప్రాజెక్టులు, కంపెనీల నేపథ్యం తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. రేరా అనుమతి పొందినవి, ఆయా ప్రాజెక్టుల పూర్తి వివరాలు, ప్రమోటర్‌ పేరు, చిరునామా, ఇతర అన్ని వివరాలు రేరా వెబ్‌ సైటులో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. బాధ్యతగా పరిశీలించుకుని మోసాలకు గురికాకుండా కొనుగోలు చేసుకోవాలని రేరా స్పష్టం చేసింది.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు

- Advertisement -

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు రేరా నిబంధనలు ఉల్లంఘించినచో వెంటనే రేరాను సంప్రదించాలని సూచించింది. వాట్సప్‌ నెం: 9000006301, ఫోన్‌ నెంబరు: 040-29394972తో పాటు మెయిల్‌ ద్వారా తగు డాక్యుమెంటరి ఆధారాలతో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొంది. వాటిని పరిశీలించి రేరా నిబంధనల ఉల్లంఘనల సెక్షను 59 ప్రకారం అపరాధ రుసము విధించడంతో పాటు చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని అథారిటి స్పష్టం చేసింది.

అంతేగాకుండా రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకునేందుకు సంభందిత జిల్లా కలెక్టర్లకు సిఫారసు చేయడం జరుగుతుందని, అదేవిధంగా లోకల్‌ అథారిటి పరిధికి వచ్చినచో క్షేత్రస్థాయిలో చర్యలకై సిఫారసు చేయడం జరుగుతుందని రేరా అథారిటి తెలిపింది.

రూ. 30.99 కోట్ల ఫైన్‌.. రూ. 13.70 కోట్లు రికవరీ

రేరా అథారిటి పూర్తి స్థాయిలో ఏర్పడిన 11 నెలల కాలంలోనే 2338 ప్రాజెక్టుల రిజిస్ట్రేష్రన్‌ పూర్తి చేయడంతో పాటు ఫామ్‌ఎమ్‌ ద్వారా అందిన దాదాపు 210 ఫిర్యాదులకు తీర్పులు జారీ చేయడం జరిగిందని అథారిటి తెలిపింది. ఇప్పటి వరకు 8270 ప్రాజెక్టులకు రిజిస్ట్రేష్రన్లు జారీ చేసినట్లు అథారిటి వెల్లడించింది.

అదేవిధంగా 918 ప్రాజెక్టులు రేరా నిబంధనలు అత్రిక్రమించినట్లు గుర్తించి 30 కోట్ల 99 లక్షల 12 వేల 963 రూపాయలు అపరాధ రుసుముగా విధించినట్లు అథారిటి స్పష్టం చేసింది. అందులో 13 కోట్ల 70 లక్షల 8 వేల 925 రూపాయలు రికవరి చేసినట్లు అథారిటి పేర్కొంది. రేరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులను రేరా ఎంతమాత్రం ఉపేక్షించబోదని, రియల్‌ రంగంలో మోసాలకు అట్టుకట్ట వేసి కొనుగోలు దారుల ప్రయోజనాలను కాపాడేందుకు రేరా చట్టం పాటు -పడుతుందని అథారిటి వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement