Thursday, May 16, 2024

Zaheerabad – భారీ వ‌ర్షాలు – అత్య‌వ‌స‌ర‌మైతే పోలీసుల‌కు ఫోన్ చేయండి – సి ఐ రాజు

ఉమ్మడి మెదక్, జులై 19( ప్రభ న్యూస్): భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయాల్లో జహీరాబాద్ సీఐ రాజు స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సి ఐ రాజు కోరారు. రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రారాదని కోరారు.

విద్యుత్ స్తంభాల , చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. వాగులు ఉదృతంగా ప్రవహించినప్పుడు దాటేందుకు ప్రయత్నించారదని ప్రాణాలకు ముప్పు ఉంటుందని వివ‌రించారు. అత్యవసర సేవల కోసం జహీరాబాద్ పోలీస్లు ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటారని, అత్యవసర సేవల కోసం ఫోన్ నంబర్లు సెల్ 87126 56731 , Dail 100కు డయల్ చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement